నవతెలంగాణ – చందుర్తి
మండల శాఖ భాజపా అధ్యక్షుడు గా మొకిలే విజేందర్ ను నియమించినట్లుగా ఆ పార్టీ శనివారం ఉత్తర్వులు జారీచేసింది. చిర్రం తిరుపతి, పెరుక గంగరాజు, వినేందర్ గత పది రోజుల కిందట అధ్యక్ష పదవి కోసం దరఖాస్తు చేసుకున్నారు. పార్టీ పరిశీలన విజేందర్ వైపు మొగ్గు చూపి నియమకానికి ఉత్తర్వులు జారీచేసింది. దీంతో మండలంలోని పలువురు ఆయన కు అభినందనలు తెలిపారు.