పది ఫలితాల్లో విజ్ఞాన జ్యోతి విజయ యాత్ర 

– టెన్ జిపిఎస్ సాధించిన పాఠశాలకు చెందిన వైష్ణవి
నవతెలంగాణ – కమ్మర్ పల్లి 

మండల కేంద్రంలోని విజ్ఞాన జ్యోతి ఉన్నత పాఠశాల  సోమవారం వెళ్ళుటైన పదవ తరగతి పరీక్ష ఫలితాలలో టాపర్ గా నిలిచింది. పాఠశాలకు చెందిన విద్యార్థి వైష్ణవి టెన్ జిపిఏ సాధించింది. పాఠశాలకు చెందిన 19 విద్యార్థులు పదవ తరగతి పరీక్షలకు హాజరవ్వగా  100% ఉత్తీర్ణత సాధించినట్లు పాఠశాల కరస్పాండెంట్ గుండోజి దేవేందర్ తెలిపారు. పాఠశాలకు చెందిన వైష్ణవి 10 జిపిఏ సాధించగా, శృతి 9.8 జిపిఏ, భువన చంద్రిక, అశ్విత్, శ్రీమాన్, సాత్విక 9.7 జిపిఏ సాధించినట్లు తెలిపారు. గణేష్ 9.5 జీపీఏ సాధించగా  మొత్తంగా 14 మంది విద్యార్థులు 9 కంటే ఎక్కువ జీపీఏ సాధించినట్లు ఆయన వివరించారు. ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులను పాఠశాల యాజమాన్యం తరఫున అభినందించారు. 9.5 కంటే ఎక్కువ జీపీఏ తో ఉత్తీర్ణత  సాధించిన విద్యార్థులను శాలువా, మెమొంటోతో అభినందించారు. ఇంతటి మంచి ఉత్తీర్ణత, విజయాన్ని సాధించిన విద్యార్థులకు, ఉపాధ్యాయ బృందానికి పాఠశాల యాజమాన్యం తరపున అభినందనలు తెలుపుతున్నట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు సౌమ్య, ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.