హీరో విక్రమ్ నటించిన ‘వీర ధీర శూరన్ పార్ట్ 2’ భారీ అంచనాల నడుమ తెరకెక్కుతోంది. ఈ చిత్రానికి ఎస్ యు అరుణ్‌కుమార్ దర్శకత్వం వహించారు. ‘ఆర్‌ఆర్‌ఆర్, విక్రమ్’ చిత్రాలను డిస్ట్రిబ్యూట్ చేసి, ‘ముబైకార్, థగ్స్, మురా’ వంటి చిత్రాలను హెచ్‌ఆర్ పిక్చర్స్ బ్యానర్ మీద రియా శిబు నిర్మించి మంచి సక్సెస్ అందుకున్నారు. ప్రస్తుతం ఈయన నిర్మాతగా ‘వీర ధీర శూరన్ పార్ట్ 2’ రాబోతోంది. ఈ క్రమంలో తాజాగా టీజర్‌ను విడుదల చేశారు. విక్రమ్ పాత్రలోని రెండు కోణాల్ని టీజర్‌లో చూపించారు. ఒక్క మాటలో చెప్పాలంటే ఆయన విశ్వరూపానికి ప్రతిబింబంగా ఈ రెండు పాత్రలు నిలుస్తాయి. ఇక పోలీస్ ఆఫీసర్‌గా ఎస్‌జే సూర్య ఈ చిత్రంలో చాలా కొత్తగా కనిపించబోతున్నారు. ఇప్పటికే ఈ సినిమా చిత్రీకరణ పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. ఈ చిత్రం వచ్చే ఏడాది జనవరిలో తమిళం, తెలుగు, హిందీ భాషల్లో భారీ ఎత్తున రిలీజ్ కానుంది అని చిత్రయూనిట్ తెలిపింది.