ఉన్నత లక్ష్యాలను ఏర్పరచుకొని గొప్ప స్థాయికి ఎదగాలి: విక్రమ్ సింహరావు

నవతెలంగాణ – ఆర్మూర్ 

విద్యార్థిని విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను ఏర్పరచుకొని గొప్ప స్థాయికి ఎదగాలని రిటైర్డ్ సెక్రటేరియల్ అధికారి విక్రమ్ సింహరావ్ అన్నారు. రోటరి క్లబ్ ఆఫ్ ఆర్మూర్  ఆధ్వర్యంలో జోరుగా హుషారుగా అనే కార్యక్రమాన్ని రోటరీ సభ్యుల సమేతంగా ఆదివారం రాత్రి నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య ఇదిగా విచ్చేసి రోటరీ ఇంటర్నేషనల్ సంస్థ లో భాగంగా ఆర్మూర్ క్లబ్బు  అధ్యక్షులు పట్వారి గోపి కృష్ణ అధ్యక్షతన గత పది నెలల నుండి ఎన్నో సేవా కార్యక్రమాలను చేయడం స్ఫూర్తిదాయకమని అభినందించారు. “విద్యార్థులు నేటి యువతరం ఆలోచనతో ధ్యానంతో మంచి ఆహారపు అలవాట్లతో దినచర్యను కొనసాగిస్తూ ఒత్తిడికి లోను కాకుండా ప్రశాంతంగా ఉన్నత లక్ష్యాన్ని ఏర్పరచుకొని దైనందిక జీవన విధానంలో గొప్ప స్థాయిలో ఉండి దేశానికి సేవ చేయాలని సందేశాన్ని అందించారు” . అనంతరం వారు స్వయంగా రచించిన ఆధ్యాత్మికత విద్యార్థి విజయా సోపానాలు తల్లిదండ్రులు యొక్క పాత్ర వివిధ అంశాలపై రూపొందించిన పుస్తకాలను రోటరీ కార్యవర్గం కలసి ఆవిష్కరించారు.  అనంతరం సైబ కిషన్, చౌకే లింగం జానపద హాస్య బుర్ర కథలు, నృత్యాలు వివిధ కళాకారుల ప్రదర్శన, మిమిక్రీ, ఆకట్టుకున్నాయి. రోటరీ క్లబ్ కి సేవలు అందించిన వారికి మరియు కుటుంబ సమేతంగా ప్రతి ఒక్కరికి అధ్యక్షులు గోపీ కృష్ణ పట్వారీ సన్మానించారు.. ఈ కార్యక్రమంలో రోటరీ కార్యదర్శి పట్వారి తులసి కోశాధికారి లక్ష్మీనారాయణ, రోటరీ సభ్యులు విజయసారథి, పుష్పకర్ రావు, ప్రవీణ్ పవార్, రజనీష్, సురేష్, చొక్కా రాజారాం, కత్రజి రాజేందర్, చేలిమేల రాజు,, చౌటి లింబద్రి, ఖాందేశ్ సత్యం, రాము, శశిధర్, ఆనంద్ , వినాయక్,బండారి ప్రసాద్, తదితులు పాల్గొన్నారు.