నల్లగొండ, ఖమ్మం, వరంగల్ పట్టుభద్రుల ఎమ్మెల్యేగా విజయం సాధించిన తీన్మార్ మల్లన్నను ఆదివారం బొమ్మలరామారం మండల కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు రాజేష్ పైలెట్ మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేశి శుభాకాంక్షలు తెలియజేశారు. పలు విషయాలపై చర్చించగా త్వరలో మండల కేంద్రానికి వచ్చి పలు సమస్యల గురించి మాట్లాడతా అన్నారని గ్రామ శాఖ అధ్యక్షులు తెలిపారు. ఈ కార్యక్రమంలో లక్ష్మణ్, అమరేందర్ గౌడ్, పలువురు నాయకులు పాల్గొన్నారు.