ప్రజల హస్తాల్లోనే గ్రామ పరిశుభ్రత

– తోటపల్లిలో యుద్ధప్రాతిపదికన ఇంకుడు గుంతల నిర్మాణం
నవతెలంగాణ – బెజ్జంకి
ప్రజల హస్తాల్లోనే గ్రామ పరిశుభ్రత దాగివుందని.. ఇంకుడు గుంతలతో మురుగు నీరుకు స్వస్తి పలకవచ్చని సర్పంచ్ బోయినిపల్లి నర్సింగరావు సూచించారు.మంగళవారం మండల పరిధిలోని తోటపల్లి గ్రామంలో యుద్ధప్రాతిపదికన చేపట్టిన ఇంకుడు గుంతల నిర్మాణాలను సర్పంచ్ నర్సింగరావు పరిశీలించారు. గ్రామ పరిశుభ్రతకు ప్రతి ఒక్కరూ తమ ఇంటి అవరణం వద్ద ఇంకుడు గుంతల నిర్మాణం చేపట్టాలని తెలిపారు. వార్డ్ సభ్యులు, పంచాయతీ కార్యదర్శి శ్రీనివాస్ పాల్గొన్నారు.