సమయానికి తెరుచుకోని పల్లె దావఖానా

– ఇబ్బందులు పడుతున్న ప్రజలు
– పట్టించుకోని వైద్యాధికారులు
నవతెలంగాణ – చివ్వేంల
ప్రజా ఆరోగ్యమే లక్ష్యంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వైద్య రంగానికి ప్రాధాన్యతనిచ్చింది. గత  ప్రభుత్వం లో  కోట్లాది రూపాయలతో పల్లె  దావఖానాలను   బలోపేతం చేసింది  . ఆధునిక వైద్య పరికరాలు సమకూర్చింది. గ్రామీణ ప్రాంతాల ప్రజలకు వైద్య సేవలను చేరువ చేసేందుకు ప్రభుత్వం పల్లె దావఖాన లను ఏర్పాటు చేసింది. పల్లె దావఖానలలో   ఒక ఎంబిబిఎస్ వైద్యుడు తో పాటు ల్యాబ్ టెక్నీషియన్, ఏఎన్ఎం ఉండాలి .  ఎంబిబిఎస్ డాక్టర్ లేని చోట స్టాప్ నర్స్ ను నియమించారు.జ్వరాలు,ఇతర నొప్పులతో పాటు బిపి,షుగర్,ఇతర దీర్ఘకాలిక వ్యాధులకు చికిత్స మందులు అందించాలినేది ప్రభుత్వం లక్ష్యం.  పల్లె దావఖానాలు ఉదయం 9గంటల నుంచి 4గంటలవరకు ప్రజలకు అందుబాటులో ఉంటూ దవఖానకు వచ్చిన ప్రజలకు వైద్యం అందించాలి.అందుకు విరుద్ధం గా మండలంలోని , లక్ష్మి నాయక్ తండాలో శుక్రవారం  దావఖానా  తాళాలు  ఉదయం 9:32  నిముషాల వరకు తాళాలు తియ్యకపోవడం తో  అనారోగ్యo తో దావఖానకు చూపించుకోవడానికి వచ్చిన రోగులు నిరాశతో వెళ్లిపోతున్నారని తండా వాసులు ఆరోపిస్తున్నారు . సమయానికి దావఖానాకు  రాకపోయినా  పట్టించుకునే వారే లేరని తండవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు… గ్రామాలలో జిల్లా వైద్యాధికారుల పర్యవేక్షణ లేకపోవడం వలనే గ్రామాల్లోని ఆశా కార్యకర్తలు, ఏఎన్ఎంలు,  ఇతర వైద్య సిబ్బంది తమను ఎవరు అడిగే వారు లేకపోవడంతో  ఇష్టానుసారంగా సమయపాలన పాటించకుండా విధులకు హాజరవుతున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు.  కొన్ని గ్రామాలలో గర్భిణీ స్త్రీలకు ప్రభుత్వం అందించే డబ్బులు ఏఎన్ఎంలు సరైన సమయంలో  డాటా ఎంట్రీ చేయకపోవడం వల్ల  డబ్బులు రావడం లేదని ఆరోపిస్తున్నారు. ముఖ్యంగా మండలంలో  వైద్యాధికారుల నిర్లక్ష్యం వల్ల ప్రవేట్ హాస్పిటల్స్ కు మండలంలోని వివిధ గ్రామాల ప్రజలు క్యూ కడుతున్నారని పలువురు ఆరోపిస్తున్నారు . ఇప్పటికైనా మండలంలోని పల్లె  దావఖానాలను తెరిచి  ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు  స్థానిక ప్రజలకు  అందుబాటులో ఉండి స్థానిక ప్రజలకు సరైన వైద్యం అందే విధంగా చూడాలని, విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తున్న వారిని విధుల నుంచి తొలగించాలని     ప్రజలు కోరుకుంటున్నారు.వివరణ కొరకు జిల్లా వైద్యాధికారిని  ఫోన్ లో  సంప్రదించగా అందుబాటులోకి రాలేదు.