నవతెలంగాణ-చౌటుప్పల్ రూరల్: చౌటుప్పల్ మండలం స్వాములవారి లింగోటం గ్రామంలో దివిస్ యజమాన్యం చేస్తున్న కృషి మరువలేమని గ్రామ ప్రత్యేక అధికారి ఆర్డబ్ల్యూఎస్ అసిస్టెంట్ ఇంజనీర్ విశాల్ రెడ్డి మంగళవారం అన్నారు.సిసి రోడ్డు నిర్మాణానికి 54 లక్షల 30 వేల రూపాయలతో దివిస్ డిజిఎం పెండ్యాల సుధాకర్ రావు తో కలిసి శంకుస్థాపన చేశారు.గ్రామంలో 5 లక్షల 36 వేల రూపాయలతో మంచినీటి సదుపాయం కోసం వాటర్ ప్లాంట్ ఈరోజు ప్రారంభించారు.గ్రామాల అభివృద్ధికి దివిస్ చేస్తున్న కృషి మరువలేమని విశాల్ రెడ్డి అన్నారు.గ్రామాల అభివృద్ధి దివిస్ యజమాన్యం సిఎస్ఆర్ నిధులతో కోట్ల రూపాయల ఖర్చు చేసిందని అన్నారు. దివిస్ సహకారం మరింతగా కొనసాగాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో మండల పరిషత్ మాజీ ఉపాధ్యక్షులు ఉప్పు భద్రయ్య సింగిల్ విండో వైస్ చైర్మన్ చెన్నగొని అంజయ్య గౌడ్ పంచాయతీ కార్యదర్శి బి. జ్యోతి దివిస్ ప్రతినిధులు బి.కిషోర్ కుమార్ బి.గోపి వి.వంశీ మాజీ సర్పంచులు మాజీ ఎంపీటీసీలు తదితరులు పాల్గొన్నారు