గ్రామాల అభివృద్దే కాంగ్రెస్ ప్రభుత్వధ్యేయం..

– పలు అభివృద్ధి కార్యక్రమాలకు భూమి పూజలు
నవతెలంగాణ – తంగళ్ళపల్లి
గ్రామాల అభివృద్ధి ధ్యేయంగా కాంగ్రెస్ ప్రభుత్వం పని చేస్తుందని జెడ్పిటిసి పూర్మానీ మంజుల లింగారెడ్డి అన్నారు. తంగళ్ళపల్లి మండలంలోని పలు గ్రామాలకు కేటాయించిన ఎస్డిఎఫ్ నిధుల నుండి చేపట్టనున్న పలు అభివృద్ధి కార్యక్రమాలకు కాంగ్రెస్ నాయకులతో కలిసి జెడ్పిటిసి సోమవారం భూమి పూజలు, శంకుస్థాపనలు చేశారు.అంకుసాపూర్ లో ఓపెన్ జిమ్ నిర్మాణానికి భూమి పూజా,చిన్నలింగాపూర్ లో ఎస్సి కాలనీ  అంగన్ వాడి భవన ప్రహరీ గోడ నిర్మాణానికి,డ్రైనేజీ నిర్మాణం కు భూమి పూజా చేశారు.వేణుగోపాల్ పూర్ లో హైమాస్ట్ లైట్ ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ అధ్యక్షులు జలగం ప్రవీణ్ కుమార్, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.