గ్రామ అభివృద్దే లక్ష్యంగా పనిచేయాలి

నవతెలంగాణ – ఉప్పునుంతల
ఉప్పునుంతల మండలం వెల్టూర్ గ్రామంలో బుధవారం స్పెషల్ ఆఫీసర్ డాక్టర్ నరేందర్  విస్తృతంగా పర్యటించి పలు కాలనీలు, వార్డులు తిరుగుతూ సమస్యలను గుర్తించి గ్రామాన్ని పరిశుభ్రత, పచ్చదనంతో ఉంచడం కోసం ప్రణాళిక రూపొందించుకొని గ్రామంలో ప్రతి డిపార్ట్మెట్ ఆఫీసర్లు, గ్రామస్తులు భాగ్య స్వాములై సమన్వయంతో గ్రామాన్ని పరిశుభ్రతగా చేసుకుందాం అన్నారు. గ్రామలలో రాష్ట్ర ప్రభుత్వం నేటినుండి తీసుకున్న ప్రత్యేక పరిశుభ్రత, పచ్చదనం కార్యక్రమంపై పలు కాలనీలు తిరుగుతూ పర్యటించారు. ఈ సందర్భంగా గ్రామంలో మురికి కాల్వలు పరిశీలిస్తూ రోడ్ల పై ఉన్న చెత్త చెదారం, మురుగు నీరు పలు సమస్యలను గుర్తించి వాటిని పరిష్కరిండానికి నోట్ చేసుకున్నారు. అదేవిధంగా గ్రామంలో ఉన్న అంగన్ వాడి కేంద్రాలు, ప్రాథమిక, ఉన్నత పాఠశాలలు మరియు ఆరోగ్య కేంద్రం పలు కార్యాలయాలను సందర్శించి అక్కడ ఉన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈనెల 15 వ తేదీ వరకు జరిగే ప్రత్యేక కార్యక్రమంలో గ్రామంలో నెలకొన్న సమస్యలను పరిష్కారం చేసేందుకు కృషి చేస్తామని వారు తెలిపారు. గ్రామంలో రాబోయే వేసవి కాలం దృష్టిలో పెట్టుకొని త్రాగు నీటి ఎద్దడి లేకుండా అలాగే ఎప్పటికప్పుడు శానిటేషన్ చేస్తూ గ్రామాన్ని పరిశుభ్రతతో ఉంచాలని వారు గ్రామ సిబ్బందికి సూచించారు. ఈ కార్యక్రమంలో పంచాయితీ సెక్రటరీ ఉమాశంకర్, ఫీల్డ్ అసిస్టెంట్ దేవేందర్, పలు శాఖల అధికారులు నవ్య, రాధ, వేదవతి, బాలమని, రజిత, రవి శేఖర్, గుద్దటి బాలరాజు, ఉప్పరి బాలరాజు, సైదులు, నిరంజన్ తదితరులు పాల్గొన్నారు.