ఇందల్ వాయి మండలం లోని గన్నారం గ్రామంలో ఆదివారం గ్రామ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో పాడి పంటలు పశువులు పంటలు సమృద్ధిగా పండాలని గ్రామాన్ని చల్లగా చూడాలని గ్రామదేవతలను పూజిస్తూ ఊర పండగ ఘనంగా నిర్వహించారు. శనివారం రాత్రి నుండి గ్రామ అభివృద్ది కమిటీ ఆధ్వర్యంలో గ్రామంలో ఉత్సాహంగా యువకులు నృత్యాలు చేస్తూ పండుగను జరుపుకున్నారు. పోతరాజుల విన్యాసాలు గ్రామస్తులను మంత్ర మృగ్దులను చేశారు.ఈ కార్యక్రమం లో గ్రామ అభివృద్ది కమిటీ సభ్యులు, గ్రామస్తులు,ఆయా కులా సంఘాల సభ్యులు తదితరులు పాల్గొన్నారు.