విద్యా, వైద్యం, భూదాతకు మరువలేం: గ్రామ సర్పంచ్ సురేష్

– గ్రామ అభివృద్ధికి మా వంతు సహాయ సహకారాలు ఉంటాయి. ఇనాని కుటుంబీకులు

నవతెలంగాణ – మద్నూర్
మద్నూర్ గ్రామ వ్యాపారవేత్త స్వర్గస్తులు రాంప్రసాద్ హినాని మద్నూర్ గ్రామ అభివృద్ధికి ముఖ్యంగా విద్యా వైద్యం అవసరాలకు స్థలాలు అందజేసిన భూదాతకు మద్నూర్ గ్రామ ప్రజలు ఎల్లవేళల మరువలేరని గ్రామ సర్పంచ్ సురేష్ తెలిపారు. ఈ సందర్భంగా రాంప్రసాద్ హినాని కుటుంబీకులైన లక్ష్మి కాంత్ హినాని గోవింద్ ఇనాని మాట్లాడుతూ మద్నూర్ గ్రామ అభివృద్ధికి ప్రజల అవసరాలకు తగిన సహాయ సహకారాలు అందించడానికి తమ వంతు కృషి ఎల్లవేళలా ఉంటుందని హామీ ఇచ్చారు. మద్నూర్ గ్రామ పెద్దలు వ్యాపారవేత్త రాంప్రసాద్ హినాని జన్మదిన ఆదివారం రోజున గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ జన్మదినం వేడుకల్లో రాంప్రసాద్ హినాని కుటుంబానికి చెందిన లక్ష్మి కాంత్ హినాని గోవింద్ హినాని పాల్గొన్నారు. పాత బస్టాండ్ సమీపంలో గల రాంప్రసాద్ నాని విగ్రహానికి పూల మాలలతో సత్కరించి జన్మదిన వేడుకలు నిర్వహించారు అనంతరం గ్రామ సర్పంచ్ సురేష్ రాంప్రసాద్ నాని కుటుంబ సభ్యులైన లక్ష్మి కాంత్ ఇనాని గోవింద్ ఇనాని మాట్లాడారు గ్రామ అభివృద్ధికి రాంప్రసాద్ అందజేసిన భూదాతకు గ్రామ ప్రజలు ఎల్లవేళల మరువరని సర్పంచ్ కొనియాడారు. రాంప్రసాద్ నాని పట్ల గ్రామస్తులు ఇంతగా గౌరవించడం ఎంతో ఆనందాంగా ఉందని గ్రామ అభివృద్ధికి ఇనాన్ని కుటుంబం ఎల్లవేళలా సహాయ సహకారాలు ఉంటాయని తెలపడం గ్రామ ప్రజలు హినాని కుటుంబం పట్ల అభినందించారు. వైద్య సౌకర్యం కోసం దాదాపు 5 ఎకరాల పైన భూమి అందజేయడం బాలుర గురుకుల పాఠశాల ఏర్పాటుకు ఐదు ఎకరాల వరకు భూమి అందజేయడం ప్రభుత్వ జూనియర్ కళాశాలకు రెండు ఎకరాల వరకు భూమిని అందించి విద్య వైద్యం కోసం ఇనాన్ని సేవలు మరువలేనివిగా గ్రామ ప్రజలు పేర్కొంటున్నారు. ఈ జన్మదిన వేడుకల్లో సర్పంచ్ సురేష్ ఉప సర్పంచ్ విట్టల్ గ్రామ మున్నూరు కాపు సంఘం అధ్యక్షులు డాక్టర్ విజయ్, గ్రామ పెద్దలు రమేష్, సెట్ తమ్మి వార్ గోవింద్, సెట్ పప్పు, సెట్ గోపాల్, సెట్ మోదన, సురేష్, సెట్ కృష్ణ, పటేల్, పంచాయతీ పాలకవర్గం సభ్యులు, ఎంపీటీసీల కుటుంబ సభ్యులు గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.