సాధనలో ఎన్నో ఒడుదొడుకులు ఎదుర్కొన్నారు. కష్టనష్టాలను దాటారు. కల సాకారమైన వేళ తమ కష్టాన్ని మరిచిపోయారు. మధ్య తరగతి కుటుంబాలకు చెందిన ఇద్దరు గ్రామ కార్యదర్శులు ప్రభుత్వ ఉపాధ్యాయ కొలువులు సాధించారు. నసురుల్లాబాద్ మండల లోని ఇద్దరూ గ్రామపంచాయతీ కార్యదర్శులకు డీఎస్సీ లో ప్రభుత్వ ఉపాధ్యాయ ఉద్యోగాలు సాధించారు. అంకోల్ తండా గ్రామపంచాయతీ కార్యదర్శి షేక్ ముఖిద్ ఎస్జిటి, రాములు గుట్ట తండా గ్రామపంచాయతీ కార్యదర్శి రాజా రత్నకుమార్ లకు స్కూల్ అసిస్టెంట్ (బయోలాజీ)గా ప్రభుత్వ ఉపాధ్యాయ ఉద్యోగం సాధించారు. గ్రామ పంచాయతీ కార్యదర్శులు ఉద్యోగం చేస్తూనే ఉపాధ్యాయ ఉద్యోగాలు సాధించడంతో తోటి గ్రామ కార్యదర్శిలు, మండల పరిషత్ ఇన్ ఛార్జ్ ఎంపీడీవో సూర్యకాంత్ వివిధ గ్రామాల ప్రజా ప్రతినిధులు వారికి శుభాకాంక్షలు అభినందించారు.