
రోడ్డు ప్రమాదంలో ధర్మసాగర్ గ్రామపంచాయతీ సెక్రెటరీ నాగపురి మహేశ్వర్ మృతి చెందిన ఘటన ఆదివారం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం మండల కేంద్రంలోని ఓ గృహప్రవేశ కార్యక్రమానికి హాజరై తిరిగి తన గోపాలపురం లోని నీవాసానికి వెళుతున్న క్రమంలో మార్గ మధ్యలో గుర్తు తెలియని వాహనం ఢీకొని మృతి చెందారని తెలిపారు. తన మృతి పట్ల గ్రామస్తులు సామాజిక మద్యమాల్లో ప్రగాఢ సానుభూతినీ తెలియజేస్తూ తన కుటుంబానికి ఓదార్పును ఆయనకు నిత్య విశ్రాంతిని కలగాలని మనసారా కోరుకుంటున్నారు. ఈ హఠాత్పరిణామంతో ధర్మసాగర్ మండలం శోకసంద్రంలో మునిగి తేలుతుంది. తన మృతి కారణాలు పూర్తిగా తెలియాల్సి ఉంది.