
మండల కేంద్రమైన రెంజల్ ప్రధాన రోడ్డు పక్కన గల కాలువ వద్ద చికెన్, మటన్, వ్యర్ధాలను వేసినట్లయితే వారిపై రూ.500 రూపాయల నుంచి రూ.5000 రూపాయల జరిమానా విధించడం జరుగుతుందనీ రెంజల్ గ్రామం పంచాయతీ కార్యదర్శి రాజేందర్ రావు హెచ్చరిక బోర్డుల ఏర్పాటు చేయించారు. పెద్ద పదార్థాలు తీసుకువచ్చి రోడ్డు పక్కన వేయడంతో దుర్గంధం ఏర్పడి కుక్కలు, పందులకు నిలయంగా మారడంతో ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందులు కలుగుతున్నాయని ఆయన పేర్కొన్నారు. చెత్త చేదారాన్ని తొలగించి ఏర్పాటు చేయడం జరిగిందని ఆయన చెప్పారు.