
మండలంలోని సికింద్ర పూర్ మహిళా గ్రామ సంఘంలో గ్రామ సంఘం ఉప విధులు నిబంధనవళి పైన ఐకెపి ఆధ్వర్యంలో శిక్షణ కార్యక్రమాలు నిర్వహించారు. చట్టబద్ధ సంస్థ మరియు పరంపర అధికారం సహకార సూత్రాలకు నిర్వచనం తదితర అంశాల పైన మండల సమైక్య కోఆర్డినేటర్ బాజన్న శిక్షణ ఇచ్చారు. ఈ సందర్భంగా గ్రామంలోని మహిళా సంఘ సభ్యులందరికీ గ్రామ మహిళా సహకార సంఘం లక్షణములు, విధుల, సభ్యత్వం, సభ్యత రులతో గ్రామ సంఘ వ్యవహారాలు, సభ్యులు ఆర్థిక బాధ్యత, మహాసభ, పాలకవర్గం పదాధికారులు, గ్రామ సంఘం సిబ్బంది శాస్తులు శిక్షణలు, వాటదనం గ్రామ సంఘం గరిష్ట రుణ పరిమితి నిధుల సేకరణ గ్రామ సంఘం కుసభ్య సంఘాలు బకాయి పడితే జరుగునామాలు మిగులు లోటు నిర్వహణ ఆడిటింగ్, ఆర్థిక లెక్కల సంవత్సరం, తదితరులు ఫైలు చేయుట, లెక్కలు మరియు రికార్డులు, శిఖర సమస్యలకు హక్కులు, వివాదముల పరిష్కారము, సలహా వర్గము, కమిటీలు, వ్యాపార పరిపాలన నియమావళి, బ్యాంకు లావాదేవీలు ఉపవిధుల సవరణ, సంఘమునకు మొదటి హక్కు, చట్టం లోని పద్ధతులు వర్తింపు, ఇతర డిపాజిట్లు, సభ్యతరులతో లావాదేవీలు, వివరణ లు మరియు చిక్కుల తొలగింపు, సంఘ మూసివేత రద్దు, పాదాయపు పన్ను నిబంధన పైన కమ్యూనిటీ కోఆర్డినేటర్ బాజన్న పూర్తిగా శిక్షణ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో గ్రామ మహిళా సంఘ ప్రతినిధులు, చిన్న సంఘాల ప్రతినిధులు, మహిళా సంఘ సభ్యులు, వివోఏ బుకీపరుల తదితరులు ఉన్నారు