
కోనరావుపేట మండలం మామిడిపల్లి గ్రామంలో ఉన్న ఇసుక రిచ్ ను గ్రామస్తులుఅడ్డుకున్నారు.ఇసుక రీచ్ నుండి సుమారు50 ట్రాక్టర్ల తో ఇసుకను తరలించే ప్రయత్నాన్ని గ్రామస్తులు అడ్డుకోగా విషయం తెలుసుకున్న డిప్యూటీ తాహసిల్దార్ సంఘటన స్థలానికి చేరుకొని గ్రామస్తులతో చర్చించిన వారు వినకపోవడంతో అక్కడి నుండి ఆధికారు వెను తిరిగి వెళ్లారు. ఇసుక రీచ్ తో భూగర్భ జలాలు అడుగంటిపోయి నీరు లేక బోరుబావులు ఎండిపోతున్నాయని వెంటనే ఇసుక రీచ్ ను నిలిపివేయాలని గ్రామస్తులు అధికారులను కోరారు.