పంచాయితి కార్యదర్శిని సన్మానించిన గ్రామస్తులు

Villagers honored Panchayat Secretaryనవతెలంగాణ – కుభీర్
మండలం పార్డి (బి) గ్రామంలో ఇటీవల పంచాయితి కార్యదర్శి కమల్ సింగ్ బెల్గం గ్రామ పంచాయతీకి బదిలీపై వెళ్లడంతో మంగళవారం ఫార్డి బి  గ్రామ పంచాయతీ కార్యాలయంలో గ్రామ మాజీ సర్పంచ్ తూము పుష్పలత రాజేశ్వర్ మాజీ ఉప సర్పంచ్ వార్డు సభ్యులు మరియు వివిధ పార్టీలకు చెందిన నాయకులు గ్రామస్తులు వారికి  ఘనంగా శాలవ పులా మలతో సన్మానించారు.ఈసందర్భంగా మాజీ సర్పంచ్ తూము పుష్పాలత రాజేశ్వర్ మాట్లాడుతూ పంచాయితీ కార్యదర్శిగా గ్రామాభివృద్ధికి ఎంతో కృషి గ్రామ అభివృద్ధికి తమతో సహాయాన్ని అందించారని అన్నారు,గ్రామానికి మంచి చేసిన అధికారులకు గ్రామస్తులు ఎప్పటికి మార్వాకుండా ఉంటామని అన్నారు.ఆయన చేసిన సేవలను గుర్తు చేసుకొని కొనియాడారు. ఈ కార్యక్రమంలో వార్డ్ సభ్యులు శంకర్ గణేష్ నారాయణ శేఖర్ తుకరం గ్గ్రామస్తులు నారాయణ శివలింగం సంతోష్ గ్రామ యువకులు తదితరులు ఉన్నారు.