భువనగిరికి నూతనంగా వచ్చి ఎమ్మార్వోగా బాధ్యతలు స్వీకరించిన శ్రీకాంత్ రెడ్డి ని భువనగిరి సింగిల్ విండో మాజీ చైర్మన్ ఎడ్ల సత్తిరెడ్డి, మాజీ ఎంపీటీసీ ఉడత శారద ఆంజనేయులు, మాజీ పాల సంఘం చైర్మన్ జిల్లా నరసింహ లు శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భువనగిరి మండలంలోని బిఎన్ తిమ్మాపూర్ గ్రామం బస్వపూర్ రిజర్వాయర్లో ముంపునకు గురవుతున్న సందర్భంగా మా గ్రామంపై ప్రత్యేక దృష్టి సారించి, గ్రామంలో మిగిలి ఉన్న పట్టా కబ్జా భూముల నష్టపరిహారం త్వరగా ఇప్పించే విదంగా కృషి చేయాలని కోరారు. హుస్నాబాద్ కేటాయించిన పునరవసంలో రోడ్లు మంచినీటి వసతి మొదలైన మౌలిక వసతులు కల్పించాలని కోరారు.