నవతెలంగాణ – జుక్కల్
మండలంలోని మహరాష్ట్ర సరిహద్దు గ్రామమైన బిజ్జల్ వాడి గ్రామములోని ప్రభూత్వ ఎంపిపీఎస్ పాఠశాల ఉపాద్యాయురాలిని ఇంగు భారతీ విఠల్ ను గ్రామ మాజీ సర్పంచ్ గౌళే యాదవ్ ఆధ్వర్యంలో గ్రామస్తులు ఘణంగా సన్మానించారు. ఈ సంధర్భంగా గురువారం నాడు పాఠశాలలో గ్రామస్తులు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మహిళా దినోత్సవం సంధర్భంగా సన్మాన కార్యక్రమం నిర్వహించి మహిళ ఉపాద్యాయురాలీనిలకు శాలువా, మెమెాంటో అందచేసి సన్మానించడం జరిగింది. మారుమూల సరిహద్దు గ్రామం లో కొన్ని ఏండ్లుగా నిరంతర కాలంగా పేద విద్యార్థులకు విద్యాభోదన చేస్తూ.. ఉన్నతంగా తీర్చిదిద్దుతూ.. గ్రామస్తులతో కలిసి మెలిసి ఉంటూ.. అందరి మన్నలను పొందుతూ..ఎన్ని కష్టాలైనా ఎదురించి నిలుస్తున్నారని మాజీ సర్పంచ్ గౌళే యాదవ్ పేర్కోన్నారు. మహిళలంటే ఆదీశక్తీ లాంటి వారని, పురుషులతో సమానంగా అన్ని రంగాలలో ముందుంటున్నారని, నిజాయితిగా పని చేసే తత్వం మహిళలకు ఉంటుందని, ఓపిక చాల ఉంటుందని గ్రామస్తులు టీచర్ భర్త విఠల్ కొనియాడారు.ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ యాదు, గ్రామస్తులు , పెద్దలు తదితరులు పాల్గోన్నారు.