నవతెలంగాణ-లోకేశ్వరం : మండలంలోని భాగపూర్ గ్రామంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో విధులు నిర్వహించి మండలంలోని పొట్పెల్లి (బి) పాఠశాలకు బదిలీపై వెళుతున్న ఉపాధ్యాయుడు రాజారాంను శుక్రవారం గ్రామస్తులు శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎందరో పేద విద్యార్థులకు చేయూతనందించి పాఠశాల అభివృద్ధిలో ఎంతో కీలక పాత్ర పోషించారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో పిఆర్టీయు రాష్ట్ర బాధ్యులు రాజేందర్,శ్రీనివాస్, జిల్లా ఉపాధ్యక్షులు అశోక్ రెడ్డి,ఎంఈఓ చంద్రకాంత్, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.