
నవతెలంగాణ – వేములవాడ రూరల్
వేములవాడ అర్బన్ మండలం అనుపురం గ్రామంలో జడ్పిటిసి మ్యాకల రవి నీ గ్రామస్తులు గురువారం గజమాలవేసి ఘనంగా శాలువలతో సన్మానించారు. గత పది సంవత్సరాలుగా మ్యాకల రవి సర్పంచ్ గా, జడ్పిటిసిగా గ్రామానికి చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. రానున్న రోజుల్లో మరిన్ని పదవులను అలంకరించి గ్రామానికే కాకుండా మండలానికి కూడా సేవలను అందించాలని ఆకాంక్షించారు. మ్యాకల రవి మాట్లాడుతూ మాజీ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ బాబు వల్లే నేను ఈ స్థాయిలో ఉన్నాను, నేటితో నా బాధ్యత ముగియలేదు, మీ ప్రతి సమస్యలో నేను ముందుంటాను అన్నారు. గ్రామస్థుల సహకారం తోనే మండలానికి సేవ చేసే భాగ్యం కలిగింది, గ్రామస్తులందరికీ పేరుపేరునా హృదయపూర్వక కృజ్ఞతలు తెలిపారు. మీకు సేవ చేసే భాగ్యం మళ్ళీ కలగాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను అని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ వెంకట రమణారావు, మెరుగు శ్రీనివాస్, నాంపల్లి రాములు, ఎర్రం ఆగయ్య తోపాటు గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.