భువనగిరి మండలంలోని బిఎన్ తిమ్మాపురం గ్రామస్తులు భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి ని కలిశారు. ఈ సందర్భంగా భువనగిరి మాజీ సింగిల్విండో చైర్మన్ ఎడ్ల సత్తి రెడ్డి మాట్లాడుతూ గ్రామంలో పురాతన పెంకుటిల్లులు అన్ని కూలిపోయే దశలో ఉన్నాయనీ, ఇటీవలే మంజూరైన ఇండ్ల నష్టపరిహారం త్వరగా చెల్లిస్తే హుస్నాబాద్ వద్ద కేటాయించిన పునరావాస ప్లాట్లలో ఇండ్లు కట్టుకుంటామని అన్నారు. మా గ్రామ నిర్వాసితుల యందు దయతలిచి ఇండ్ల నష్టపరిహారం సాధ్యమైనంత తొందరగా చెల్లించాలని కోరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే స్పందిస్తూ ఈ నెల 17 వ తేదీ తర్వాత తప్పకుండా ఇండ్ల నష్టపరిహారం నిర్వాసితుల ఖాతాలో జమ చేస్తామని హామీ ఇచ్చినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు పాల్గొన్నారు.