
భువనగిరి మండలంలోని వీరవేల్లి ముదిరాజ్ సంఘం మత్సకార సంఘం నాయకులు శనివారం భువనగిరి శాసనసభ్యులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి ని హైదరాబాద్ తన నివాసంలో మర్యాద పూర్వకంగా కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు . ఈ సందర్భంగా సంఘం నాయకులు మాట్లాడుతూ ముదిరాజ్ మాత్స్యకార సంఘం నాయకులు గ్రామం లో ఉన్నటు వంటి పెద్ద సమస్య చెరువులో కలుషితం డ్రైనేజీ వాటర్ ని తొలగించాలని, కలుషితం అవుతున్న అండర్ గ్రౌండ్ డ్రైనేజి 1500మీటర్లు తొలగించాలని, గ్రామం లో పలు అభివృద్ధి పనులకు సహకరించాలని కోరినట్లు తెలిపారు. ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించారని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ మాత్స్య శాఖ అధ్యక్షులు సోకం రాజశేఖర్ , ముదిరాజ్ ఉపాధ్యక్షులు బీమరి మచ్చేందర్, కార్యదర్శి సోకం వేమన కృష్ణ, గ్రామశాఖ అధ్యక్షులు రేగు శ్రీశైలం, సభ్యులు బీమరి మల్లేష్, తమ్మల నిలయ్యే లు పాల్గొన్నారు.