– నవతెలంగాణ- హన్వాడ
ఇటీవల ప్రభుత్వ నిర్వహించిన ప్రజా పాలనలో గహ జ్యోతి కింద దరఖాస్తు చేసు కున్న ప్రజలకు విద్యుత్ అధికారులు జీరో బిల్లులు ఇవ్వడంలేదని తహసీల్దార్ కార్యాలయం ముందు వివిధ గ్రామాల ప్రజలు ధర్నా నిర్వహించారు.అర్హులైన వారు ప్రజా పాలనలో దరఖాస్తు చేసు కున్నారని గుర్తు చేశారు. మాకు జీరో బిల్లులు రావడంలేదని అన్నారు దీనిపై తహసీల్దార్ కిస్తా నాయక్ విద్యుత్ డీఈకి తగు చర్య నిమిత్తం పంపించారని తెలిపారు.