
నవతెలంగాణ- మద్నూర్
మద్నూర్ మండల కేంద్రంలోని పాత బస్టాండ్ సమీపంలో గల పురాతనమైన ఆంజనేయ స్వామి ఆలయం భారీ వర్షాల మూలంగా ఊరుస్తుంది. గ్రామ ప్రజలకు అత్యంత ముఖ్యమైన శుభ కార్యక్రమాలకు ఈ ఆలయమే ప్రఖ్యాతగాంచింది. ఎందుకంటే గ్రామంలో ఎవరు పెళ్లిళ్లు చేయాలన్నా ఈ ఆలయం నుండే పెండ్లి కుమారులకు సేవన్జాల శోభ యాత్ర ఉంటుంది. మద్నూర్ మండల కేంద్రం ఇటు తెలంగాణ అటు మహారాష్ట్ర కర్ణాటక మూడు రాష్ట్రాలకు పూర్తిగా సరిహద్దులో ఉంది మూడు రాష్ట్రాల జనాలు ఎక్కడికి వెళ్లాలన్నా ఈ పాత బస్టాండు నుండే వెళ్తారు. బస్సుల కోసం ఎదురుచూసే జనాలు ఆలయం వద్దనే కూర్చుంటారు. అతి ముఖ్యమైన ఆలయం భారీ వర్షాలకు ఉరుస్తుందని ఆలయ పైకప్పు మరమ్మతులకు వచ్చినట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. గ్రామ ప్రజలు ముందుకు వచ్చి ఆలయ అభివృద్ధికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు.