
హిందూ సనాతన ధర్మ పాదయాత్రలో భాగంగా 2016లో కర్ణాటక ఉడిపి మఠం నుండి అయోధ్య వరకు పాదయాత్ర చేపట్టిన లక్ష్మీపతి స్వామీజీ ఆదివారం మండల కేంద్రానికి చేరుకున్నారు. ఆయనకు స్థానిక ఆర్య వైశ్యులు, యువకులు ఘన స్వాగతం పలికారు.ఇప్పటివరకు లక్ష్మీపతి స్వామీజీ కర్ణాటక ఉడిపి మఠం నుండి అయోధ్య వరకు పాదయాత్ర చేపట్టి 7 సంవత్సరాలు గడిచినట్లు ఆయన తెలిపారు. కర్ణాటక, ఆంధ్ర ప్రదేశ్, తమిళనాడు, కేరళ, తెలంగాణ మీదుగా అయోధ్య వరకు పాదయాత్ర సాగుతున్నట్టు వివరించారు. స్వామీజీ 30 సంవత్సరాల క్రితం తన ఒక కిడ్నీ ని కూడా ఒకరికి దానం చేసినట్లు తెలిపారు. రోజుకు 25 నుంచి 30 కిలోమీటర్లు మేరా పాదయాత్ర కొనసాగిస్తున్నట్లు వెల్లడించారు. మండల కేంద్రానికి విచ్చేసిన స్వామీజీకి కావలసిన భోజన, విశ్రాంతి సౌకర్యాలను ఆర్యవైశ్యులు కల్పించారు.