
త్రాగునీటి సమస్యను గ్రామస్తులు పంచాయతీ అధికారులతో కలిసి రాగవ పట్నం గ్రామంలో పరిష్కరించుకోవడం జరిగింది. మంచినీటి వారోత్సవాల సందర్భముగా గ్రామములోని దయ్యాల వాగు నందు గల ఫిల్టర్ నుండి మంచి నీరు రాకపోవడంతో గ్రామపంచాయతీ కార్యదర్శి రంజిత్ కుమార్ మరియు గ్రామములోని పెద్దలు అందరూ కలిసి దయ్యలవాగులో గల ఫిల్టర్ ని తీసి మరొక చోటికి వేయడంతో మంచినీటి సరఫరా సక్రమంగా కొనసాగుతుంది.దీనితో గ్రామంలో వేసవి దృష్ట్యా సకాలములో మంచినీరు అందించినందుకు గాను గ్రామ పంచాయతీ వారిని మరియు సహకరించిన గ్రామపెద్దలకు గ్రామస్థులు కృతజ్ఞతలు తెలిపారు. ఇట్టి కార్యక్రమంలో పంచాయతీ బిల్ కలెక్టర్ హబీబ్ ఖాన్ గ్రామపెద్దలు గొంది మొగిలి, తుమ్మల వెంకట రమణ, చిడం సాంబయ్య,మధు మరియు గ్రామపంచాయతీ సిబ్బంది గింది రాజయ్య పాల్గొన్నారు.