
మండలంలోని జంగంపల్లి గ్రామంలో గత మూడు రోజుల నుండి కురుస్తున్న వర్షాలకు గ్రామంలో ఉన్న పెద్ద చెరువు అలుగు పారుతున్న సందర్భంగా గ్రామస్తులు గంగమ్మ తల్లికి పూజలు నిర్వహించారు. వరుసగా మూడవసారి చెరువు నిండిన సందర్భంగా గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ నర్సింలు యాదవ్, ఉప సర్పంచ్ భాస్కర్, ఎంపీటీసీ యశోద, బిఆర్ఎస్ పార్టీ మండల ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్, డిసిసిబి డైరెక్టర్, సొసైటీ చైర్మన్ సిద్ధరాములు, గ్రామ పెద్దలు, తదితరులు పాల్గొన్నారు.