గ్రామాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి..

– అధికారులను ఆదేశించిన డీపీవో వీరబుచ్చయ్య
– మండలంలో స్వచ్ఛసర్వేక్షన్ బృందం సందర్శన 
నవతెలంగాణ-వీణవంక
గ్రామాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, ఇందుకోసం సిబ్బందికి ప్రజలు సహకరించాలని డీపీవో వీరబుచ్చయ్య సూచించారు. మండలంలోని హిమ్మత్ నగర్, గంగారం, చల్లూరు తదితర గ్రామాల్లో స్వచ్ఛ సర్వేక్షన్ బృందం సోమవారం సందర్శన చేసింది. ఈ సందర్భంగా గ్రామాల్లోని మరుగుదొడ్ల నిర్మాణం, నీటి సదుపాయం, ఇంకుడు గుంతల నిర్మాణం తదితర పనులను పరిశీలించింది. అనంతరం డీపీవో వీరబుచ్చయ్య మాట్లాడుతూ గ్రామస్థాయిలో నిర్వహిస్తున్న పారిశుద్ధ్య కార్యక్రమాలు, సిగ్రిగేషన్ షెడ్డు నిర్వహణను సక్రమంగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. అలాగే తడి చెత్త, పొడి చెత్త సేకరణ కంపోస్టు తయారీ, ప్రజల వ్యక్తిగత పరిశుభ్రత, పారిశుధ్య కార్యక్రమాల ప్రజలకు ఎప్పటికప్పుడు అవగాహన కల్పించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో స్వచ్ఛ సర్వేక్షన్ గ్రామీణ పరిశీలన బృందం, యూనిసెఫ్ జిల్లా కోఆర్డినేటర్ కిషన్ స్వామి, ఎంపీడీవో కె శ్రీనివాస్, ఎంపీవో కె ప్రభాకర్, సర్పంచులు, ఎంపీటీసీలు, వార్డు సభ్యులు, ప్రజా ప్రతినిధులు, ప్రజలు, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.