రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వమే…వినయ్ కుమార్ రెడ్డి

నవతెలంగాణ-ఆర్మూర్
రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వమే అని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎమ్మెల్యే పొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి అన్నారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా  నియోజక వర్గంలోని ఆర్మూర్, గోవింద్ పెట్, అంకాపూర్ గ్రామాల్లో శనివారం రాత్రి విస్తృతంగా పర్యటించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. నియోజకవర్గ ప్రజలని మోసం చేశాడని అన్నారు. రెండుసార్లు ఎమ్మెల్యేగా అవకాశం ఇచ్చిన ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చలేదని అన్నారు. కమిషన్లకుసంబంధించిన పనులను చేశాడని, ఎమ్మెల్యే వెనుకాల ఉన్న చోటామోటా నాయకులు దౌర్జన్యంగా కబ్జాలు చేశారని అన్నారు. ఎవరైనా ఎదిరిస్తే కేసులు పెట్టి నానా హింసలు చేశారని అన్నారు. నేను మీకు ఉన్నానని నేను పక్కాలోకల్ అని అన్నివేళలా మీకు అండగా ఉంటానని వినయ్ కుమార్ రెడ్డి అన్నారు. బిఆర్ఎస్ ప్రభుత్వాన్ని తెలంగాణ నుంచి తరిమి కొట్టాలని ప్రజలు నిర్ణయించారని అన్నారు. ఆర్మూర్ నియోజక వర్గంలో బిఆర్ఎస్ పార్టీని ఎమ్మెల్యే జీవన్ రెడ్డిని చిత్తుగా ఓడించాలని ప్రతి గ్రామ గ్రామంలో ప్రజలు నిర్ణయించుకున్నారని అన్నారు. జీవన్ రెడ్డి రైస్ కుక్కర్రు, బంగారం, చీరలు పంపించిన తీసుకొని హస్తం గుర్తుకు ఓటేయాలని అన్నారు. బిఆర్ఎస్, బీజేపీ రెండు పార్టీలు ఒకటేనని, ఈ రెండు పార్టీలకు ఓటు వేయొద్దని అన్నారు, ఆర్మూర్ నియోజకవర్గంలో ఒక్క డబుల్ బెడ్ రూమ్ కూడా కట్టలేదని,ఇటువంటి ఎమ్మెల్యేను వెంటనే తరిమికొట్టాలని అన్నారు. ఇప్పుడు మోసపోతే మీకు ఆ దేవుడు కూడా క్షమించడని అన్నారు. బిజెపి అభ్యర్థి, టిఆర్ఎస్ అభ్యర్థి ఇద్దరు మోసగాళ్లు అని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ముందుగానే ఉద్యోగుల కోసం నోటిఫికేషన్ల తేదిలను కూడా ప్రకటించిందని అన్నారు .కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇచ్చి,భారీ మెజార్టీ గెలిపించాలని అన్నారు. తెలంగాణలో డబుల్ బెడ్ రూములు కట్టని ఎమ్మెల్యే అంటే జీవన్ రెడ్డి అని అన్నారు. ఇప్పటికైనా ప్రజలు మోసపోకుండా మంచి మనసుతో ఆశీర్వదించి హస్తం గుర్తుకు ఓటెయ్యాలని అన్నారు. నేను కరోనా టైం లో అందర్నీ ఆదుకున్నానని, అంకాపూర్ గోవింద్ పెట్ గ్రామాల్లో ఉన్న ప్రజలని ఎల్లవేళలా ఆదుకున్నానని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారంటీలను కచ్చితంగా అమలు చేస్తామని ఆయన అన్నారు. ఈ 6 గ్యారంటీలలలో మొదటిది మహాలక్ష్మి పథకం కింద ప్రతి మహిళకు ప్రతి నెల 2500 రూపాయలు, 500 కి గ్యాస్ సిలిండర్, ప్రతి మహిళకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం కల్పిస్తామని అన్నారు. గృహలక్ష్మి పథకం కింద  ప్రతి కుటుంబానికి  200 యూనిట్ల ఉచిత విద్యుత్  ఇస్తామని అన్నారు. ఇందిరమ్మ ఇండ్లు పథకం కింద  ఇల్లు లేని వారికి ఇంటి స్థలం, 5 లక్షల రూపాయలు, స్థలం ఉన్న వారికి ఇల్లు కట్టుకోవడానికి 5 లక్షల రూపాయలు, తెలంగాణ ఉద్యమకారులకు 250 చదరపు గజాల ఇంటి స్థలం ఇస్తామని  తెలిపారు. రైతు భరోసా పథకం కింద ప్రతి ఏటా 15000 రైతులకు, కౌలు రైతులకు ఇస్తామని, అలాగే వ్యవసాయ కూలీలకు సంవత్సరానికి 12,000, అలాగే వరి పంటకు 500 బోనస్ ఇస్తామని తెలిపారు. చేయూత పథకం కింద  57 సంవత్సరాలు  నిండిన, అర్హత ఉన్న వృద్ధులు అందరికీ  నెలవారి పింఛన్ 4000 రూపాయలు ఇస్తామని, అలాగే రాజీవ్ ఆరోగ్య శ్రీ బీమా కింద పది లక్షల రూపాయలు ఇస్తామని, ఆరోగ్యశ్రీ కార్డు ఉంటే ఎక్కడైనా ఏ హాస్పిటల్ అయినా వెళ్లొచ్చని అన్నారు. యువ వికాసం  పథకం కింద  విద్యార్థులకు 5 లక్షల విద్యా భరోసా కార్డు, ప్రతి మండలంలో తెలంగాణ ఇంటర్నేషనల్ స్కూల్స్  ఇస్తామని ఆయన అన్నారు. ఈ ప్రచార కార్యక్రమంలో పలువురు నాయకులు పాల్గొన్నారు.