నవతెలంగాణ – మక్లూర్
గ్రామాలలో సమస్యలు ఏమైనా ఉంటే నాదృష్టికి తీసుక రాండి తిరుస్తనాని ఆర్మూర్ కాంగ్రెస్ పార్టీ నియోజక వర్గ ఇంఛార్జి పొద్దుటురి వినయ్ రెడ్డి పేర్కొన్నారు. బుదవారం ఆలూరు మండలంలోని కల్లేడ గ్రామంలో గల మున్నూరు కాపు సంఘ భవనం వద్ద రేకుల షెడ్డు ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. ఈ రేకుల షెడ్డు ను వాచ్ మెన్, ఇతర అవసరాలకు ఉపయోగపడేలా సుమారు రూ. 4 లక్షలు వెచ్చించి ఏర్పాటు చేసిన స్థానిక గ్రామస్థులు డేగ పోశేట్టిని అభినందించారు. ఈ సందర్భంగా వినయ్ రెడ్డి మాట్లాడుతూ ప్రతి గ్రామంలో అనేక సమస్యలు ఉన్నాయని వాటిని తన దృష్టికి తీసుక వేస్తే తీరుస్తానని తెలిపారు. గ్రామంలో గల స్కూల్ లో మరుగు దొడ్డి సమస్య, సీసీ రోడ్డు, డ్రైనేజీ సమస్య ఇలా ఉపయోగపడే సమస్యల గురించి తెలుపలని అన్నారు. ఎన్నిక సమయంలోనే రాజకీయం చేయాలని, ఎన్నికల అనంతరం అబివృద్దికి ప్రతి ఒక్కరూ కలిసి గ్రామ అబివృద్దికి కృషి చేయాలని వివరించారు. ఎవరికైనా సిఎం రిలీఫ్ పండు కావాలంటే తనను సంప్రదించాలని, బాధితులకు అండగా ఉంటానని అన్నారు. స్థానిక ఆసుపత్రులలో బిల్లులు ఎక్కువగా వేస్తే వినయ్ రెడ్డి దృష్టికి తీసుక వేస్తే తక్కువ చూస్తానని, ఈ విధంగా తనను ఉపయోగించుకోవాలని తెలిపారు. ముందుగా కల్లేడ గ్రామంలో చలివెంద్రన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మండల అద్యకులు రవి ప్రకాష్, బ్లాక్ అధ్యక్షులు, ఎంపిటిసి వెంకటేశ్వరరావు, సింగిల్ విండో చైర్మన్ బుర్రోల్ల అశోక్, మాజీ సింగిల్ విండో చైర్మన్ కొట్టల లింగరావు, జిల్లా నాయకులు డేగ పోశెట్టి, మాజీ ఎంపిటిసి సతీష్, మాజీ సర్పంచులు రాజేందర్, చిన్నయ్య, రాథోడ్ జైల్ సింగ్, స్వామి, బెగారి రాజు, మున్నూరు కాపు సభ్యులు, కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు.