ఎన్నికలలో ఇచ్చిన హామీలను నెరవేరుస్తాం: వినయ్ రెడ్డి

నవతెలంగాణ – ఆర్మూర్
జర్నలిస్టుల సంక్షేమానికి కృషి చేస్తూ ఇళ్ల స్థలాలు, ఇందిరమ్మ ఇండ్లకు ప్రత్యేక దృష్టి సారించి అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేరుస్తానని కాంగ్రెస్  నియోజకవర్గ ఇంచార్జి ప్రొద్దుటూరు వినయ్ కుమార్ రెడ్డి అన్నారు.  పట్టణంలోని పివిఆర్ భవన్లో విలేకరులతో . సమావేశం నిర్వహించినారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత కాంగ్రెస్ హయాంలోనే జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు చేకూరయని చెప్పారు. బిఆర్ఎస్ పాలనలో ఆర్మూర్ జర్నలిస్టులకు చేసిందేమీ లేదని వారన్నారు. అతికొద్ది రోజుల్లోనే గతంలో ఇచ్చిన ఇండ్ల స్థలాలకు సీసీ రోడ్డు ఏర్పాటు చేస్తూ, విద్యుత్ లైను అమలు అయ్యేలా చేస్తానని హామీ ఇచ్చారు.అదేవిధంగా ఇళ్ల స్థలాలు ఉన్నవారికి ప్రభుత్వ పథకం ద్వారా ఐదు లక్షల రూపాయలు, ఇప్పటివరకు ఎటువంటి లబ్ధి పొందని వారికి యుద్ధ ప్రతిపాదికన ఇందిరమ్మ ఇండ్లు ఇప్పించేందుకు కృషి చేస్తానన్నారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నందున సీఎం రేవంత్ రెడ్డి, మంత్రుల సహకారంతో ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా ఉంటున్న జర్నలిస్టుల సంక్షేమానికి పెద్దపీట వేస్తానని మాట ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులు పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో మాజి గ్రంథాలయ చైర్మన్ మార చంద్రమోహన్ , మున్సిపల్ చైర్మన్ వన్నెలదేవి అయ్యప్ప శ్రీనివాస్ ,మాజి మున్సిపల్ చైర్మన్ సంజయ్ సింగ్ బబ్ల్యూ , పట్టణ అధ్యక్షలు సాయి బాబా గౌడ్ ,మామిడిపల్లి మాజి సర్పంచ్ మారుతి రెడ్డి ,కౌన్సిలర్ కొంతం మురళి ,,చిట్టి రెడ్డి ,రాజు భాయ్ తదితరులు పాల్గొన్నారు.