
వినాయక నిమంజనం జాగ్రత్తగా నిర్వహించాలని ఎంపిడిఓ ఉమారాణి అన్నారు. సోమవారం మండలం లోని సమ్మక్క సారక్క పుష్కర ఘాట్ వద్ద ఏర్పాట్లను పరిశీలించి మాట్లాడారు. అధిక సంఖ్యలో విగ్రహాలు వచ్చే అవకాశం ఉందని ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ప్రత్యేక ఏర్పాట్లపై పోలీస్ యంత్రాగానికి పలు సలహాలు, సూచనలు చేశారు. విగ్రహాల నిమజ్జనాలలో ఎలాంటి అపశ్రుతులు, అవాంతరాలు తలెత్తకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలని, నిమజ్జన కార్యక్రమానికి వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా, ప్రమాదాలు జరగకుండా అన్ని చర్యలు చేపట్టాలని ఆదేశించారు.ఈ కార్యక్రమంలో ఎస్ఐ వీరబాబు, సిబ్బంది ఉన్నారు.