జెట్వెర్క్‌ బోర్డులోకి వినోద్‌ కుమార్‌ దాసరి

బెంగళూరు: ప్రముఖ కాంట్రాక్టు మానుఫాక్చరింగ్‌ సంస్థ జెట్వెర్క్‌ బోర్డు ఆఫ్‌ డైరెక్టరుగా వినోద్‌ కుమార్‌ దాసరి నయమితులయ్యారు. తయారీ రంగంలో అయనకున్న విశేష అనుభవం తమ నాయకత్వాన్ని మరింత బలోపేతం చేయనుందని ఆ కంపెనీ కో-ఫౌండర్‌, సిఇఒ అమ్రిత్‌ ఆచార్య తెలిపారు. ఆటోమోటివ్‌, ఇంజినీరింగ్‌తో సహా విభిన్న రంగాలలో దాసరి దాదాపు నాలుగు దశాబ్దాల అనుభవం కలిగి ఉన్నారని పేర్కొన్నారు.