– హాజరైన మాజీ ఎమ్మెల్యే సతీష్ కుమార్
నవతెలంగాణ – హుస్నాబాద్ రూరల్
రాబోయే పార్లమెంటు ఎన్నికలలో కరీంనగర్ పార్లమెంటు స్థానం నుండి పోటీ చేస్తున్న బోయినపల్లి వినోద్ కుమార్ ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని మాజీ ఎమ్మెల్యే సతీష్ కుమార్ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఆదివారం హుస్నాబాద్ లో బీఆర్ఎస్ పార్టీకార్యాలయం లో ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ..గత అసెంబ్లీ ఎన్నికల్లో జరిగిన పొరపాట్లను సరిదిద్దుకుంటూ వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో కార్యకర్తలు, సైనికుల్లా పనిచేయాలని సూచించారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. వరంగల్ పార్లమెంటు అభ్యర్థిగా ప్రస్తుత హనుమకొండ జిల్లా పరిషత్ చైర్మన్ డాక్టర్ సుధీర్ కుమార్ అవకాశం కల్పించాలనీ పార్టీ అధినాయకత్వాన్ని కోరుతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ ప్రజా ప్రతినిధులు ,పార్టీ కార్యకర్తలు నాయకులు తదితరులు పాల్గొన్నారు.