బీఆర్ఎస్ ఆధ్వర్యంలో వినోద్ కుమార్ జన్మదిన వేడుకలు

నవతెలంగాణ-వీణవంక
ప్రణాళికా సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు, కరీంనగర్ మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ జన్మదిన వేడుకలను మండల కేంద్రంలో శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కేక్ ను కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు, ప్రజాప్రతినిధులు మాట్లాడుతూ భవిష్యత్ మరిన్ని పదవులు పొందాలని, ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో నాయకులు, ప్రజాప్రతినిధులు ముసిపట్ల తిరుపతిరెడ్డి, గంగాడి తిరుపతిరెడ్డి, నీల కుమారస్వామి, నాగిడి సంజీవరెడ్డి, పోతుల నర్సయ్య, పర్లపల్లి రమేష్, బండారి ముత్తయ్య, రెడ్డిరాజుల రవి,  యాసిన్, తాండ్ర శంకర్, మోరె సారయ్య, రవీందర్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.