వినోద్‌రెడ్డి మృతి సీపీఐ(ఎం)కు తీరనిలోటు

–  సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు చెరుపల్లి సీతారాములు
నవతెలంగాణ-సంస్థాన్‌నారాయణపురం
గుజ్జ ఎంపీటీసీ, సీపీఐ(ఎం) నాయకులు దోడ వినోద్‌రెడ్డి మృతి పార్టీకి తీరనిలోటని సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు చెరుపల్లి సీతారాములు అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్‌ నారాయణపురం మండలం గుజ్జ గ్రామంలో గ్రామ ప్రజలు, పార్టీ కార్యకర్తలు, బంధుమిత్రులు కన్నీటితో వినోద్‌రెడ్డి మృతదేహానికి తుది వీడ్కోలు పలికారు. మృతదేహానికి చెరుపల్లి సీతారాములు పూలమాలలేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామంలో పార్టీ బలోపేతానికి వినోద్‌రెడ్డి ఎంతో కృషి చేశారన్నారు. ప్రజాసమస్యల పరిష్కారంలో నిరంతరం ముందుండేవాడని గుర్తు చేశారు. అంత్యక్రియలకు నారాయణపురం మండలంలోని పలు గ్రామాల పార్టీ కార్యకర్తలతో పాటు ఉమ్మడి నల్లగొండ జిల్లా నుంచి అనేక మంది పార్టీ కార్యకర్తలు హాజరయ్యారు. పుట్టపాకకు చెందిన డప్పు కళాకారులతో పాటు వివిధ గ్రామాలకు చెందిన ప్రజానాట్యమండలి కళాకారులు ఆటపాటలతో అంతిమయాత్ర నిర్వహించారు. మునుగోడు ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి చలమల్ల కృష్ణారెడ్డి, జెడ్పీటీసీ వీరమల్ల భానుమతి వెంకటేష్‌, పుట్టపాక ఎంపీటీసీ మర్రి వసంత, సీపీఐ(ఎం) నల్లగొండ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బండ శ్రీశైలం, తదితరులు పాల్గొన్నారు.