– రాజకీయం వేరే లెవెల్ లో ఉంటుంది..
– నిజాయితీగా ఉంటే మాత్రం కుదరదు..!
– దేవాలయ ముఖ్య శాఖలో అడ్డగోలుగా అవినీతి..
– అందరూ స్థానికులే.. పెద్ద ఎత్తున పైరవీ కారులు..
నవతెలంగాణ – వేములవాడ
దక్షిణ కాశీగా ప్రసిద్ధిగాంచిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవాలయం.. తెలంగాణకే తలమానికం.. ప్రతిఏటా రూ.200 కోట్ల ఆదాయం రాజన్న ఖజానాకు జమవుతుంది.. ప్రతిరోజు దేశ, విదేశాల నుండి ,ఇతర రాష్ట్ర నలుమూలల నుండి భక్తులు వచ్చి రాజన్నను దర్శించుకొని తరిస్తారు.. రాజన్న దేవాలయంలో పనిచేసే వారు అంతా స్థానికులే వారికి ఈ క్షేత్రం కాసులు కురిపించే కామధేనువు.. రాజన్న పేదల దేవుడిగా పూజలు అందుకుంటున్న “పూర్ గాడ్” (పేదల దేవుడు), దేవాలయ ఉద్యోగులు మాత్రం “వెరీ రిచ్”(కోటీశ్వరులు).. దేవాలయంలో ఎప్పుడు ఏదో ఒక సందర్భంలో దేవాలయ సిబ్బంది అవినీతి బాగోతం వార్త ముచ్చటకు వస్తూనే ఉంటుంది, సిబ్బంది అవినీతి లో అనకొండలు భారీ తిమింగలాలు.. ఉన్నత స్థాయి అధికార, ప్రజా ప్రతినిధుల దగ్గర అతి వినయం.. వంగి..వంగి దండాలు పెట్టడం, మచ్చిక చేసుకోవడంలో దిట్ట వీళ్ళు.. వీరికి తోడు వేములవాడ రాజకీయ నాయకులు అండదండలు బావ, మామ, అన్న,తమ్ముడు, నాన్న, బాబాయ్, అబ్బాయి అనే పిలుచుకునే వరసలు, సంబంధాలు ఉన్నాయి.. ఈ క్షేత్రంలో రాజకీయం వేరే లెవల్లో ఉంటుంది.. ఈ క్షేత్రానికి వచ్చే కార్యనిర్వాహక అధికారి (ఈవో) విధుల పట్ల, సిబ్బంది పట్ల స్ట్రిక్ట్ గా ఉంటే నడవదు. గతంలో వచ్చిన ఇన్చార్జి ఈవోలు రమాదేవి, జ్యోతి ఈవోలను కొద్ది నెలల్లోనే సాగనింపేదాక ఊరుకోలేదు. ఈ దేవాలయానికి ధర్మాదాయ, దేవాదాయ శాఖ నుండి ఈవోలుగా రావాలంటే దడుచుకుంటారు. అదే రీతిలో ఇక్కడ రాజకీయం, సిబ్బంది మెదిలే తీరు అలా ఉంటుంది. వచ్చిన అధికారి దగ్గర శ్రేయోభిలాషులుగా, అతివినియం నటిస్తూ.. వెనకాల జిత్తుల మారి నక్కల, ఊసరవెల్లిలా రంగులు మారుస్తూ తోడేళ్ల అధికార, ప్రతిపక్ష నాయకులతో కలిసి గోతులు తోడుతారు. దేవాలయంలోని ముఖ్య శాఖలో అడ్డగోలు అవినీతి దేవాలయ ముఖ్య విభాగాల్లో లడ్డు, శానిటేషన్, గోదాం, ఆడిట్, పర్యవేక్షణ విభాగాలు బంగారు బండగారాలు.. గతంలో అవినీతి నిరోధక శాఖ తనిఖీ చేసి అవినీతిని బట్టబయలు చేశారు. అప్పుడు ఇంకొందరు ఇండ్లలో, వారి శాఖల్లో ఏసీబీ తనిఖీలు జరుగుతాయని వేములవాడలో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. ఏసీబీ తనిఖీలు వారి ఇళ్లలో ఆ శాఖలో జరిపి ఉంటే మరి కొంతమంది అనకొండలు తిమింగలాల జాతకం బయటపడేదని వేములవాడ పట్టణ ప్రజలు మాట్లాడుకున్నారు..
ఉద్యోగుల అవినీతి బాగోతం..
అధికారుల, ఉద్యోగుల జీతాలు ఎంత..? సంవత్సర ఆదాయం ఎంత..? వారు సంపాదించిన ఆస్తులు ఎంత..? వీటిపై విచారణ జరిపితే వీళ్ళ బాగోతం అంతా బయటపడతది.. అవినీతి బాగోతం, అక్రమార్జన, నకిలీ డిగ్రీ సర్టిఫికెట్లతో పదోన్నతులు, ఏ ఈ ఓ లు దీర్ఘకాలికంగా ఒకే శాఖలో వీధుల పై నవ తెలంగాణ దినపత్రికలో ప్రత్యేక వరుస కథనాలు ప్రచరితమయ్యాయి.. ఇక్కడే పోస్టింగ్.. ఇక్కడే ఉద్యోగ విరమణ.. గతంలో విజిలెన్స్ దాడుల్లో 14 మంది అవినీతి అధికారుల చిట్టా బయటకు వచ్చిన ఇంతవరకు ఆ 14 మంది ఉద్యోగులపై చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు..అవినీతిపై విచారణ జరిపి విజిలెన్స్ ఇతర శాఖల అధికారులకు దేవాలయ అధికారులకు దగ్గరికి సంబంధాలు ఉంటాయి.. ముందస్తు సమాచారం దాటవేస్తూ అవినీతికి కళ్లెం పడకుండా చూస్తారని భక్తుల అభిప్రాయం.. నూతనంగా వచ్చిన ఈవో నచ్చితే సరే.. లేకుంటే రాజకీయం చేయడం మొదలుపెడతారు.. వారికి నచ్చిన శాఖలో ఒప్పందం కుదుర్చుకొని శాఖల బదిలీలు లేకుండా చేసుకుంటారు.. దేవాలయ ఉద్యోగుల బాగోతం రాసిన కొద్ది “రామకోటి”ల రాస్తూ.. రాస్తూ పోతూనే ఉండాలి.. దేవాలయంలో ఈవో బదిలీ అయి, కొత్తగా వచ్చినప్పుడల్లా ఈవో మార్పుతో నైనా ఆలయ అవినీతి అడ్డుకట్ట పడుతుందా..? ఈవో మార్పుతోనైనా భక్తులకు మెరుగైన వసతులు, సిబ్బంది భక్తులపై చీదరింపులు, కోపతాపాలు బ్రేకులు పడతాయా..? విఐపి భక్తులను, సామాన్య భక్తులను ఒకే రకంగా చూస్తారా..? అంటూ విలేకరులు వార్తలు రాయడం సర్వసాధారణం.. ఎవరు ఎన్ని వార్తలు రాసిన ,ఎన్ని వార్త కథనాలు వచ్చిన దేవాలయ ఉద్యోగుల పనితీరు మారదు.. భక్తులకు మెరుగైన వసతులు, సమకూరవు.. అవినీతి అడ్డుకట్ట పడదని రాజన్న భక్తులు గట్టిగా విశ్వసిస్తున్నారు. ఇప్పుడు వచ్చిన ఆలయ ఈవో జర భద్రంగా విధులు నిర్వర్తించాలని వేములవాడ రాజన్న భక్తులు, పట్టణ ప్రజలు కోరుకుంటున్నారు.
ఇంచార్జ్ ఈవోలతోనే..
పేద భక్తులు రాజన్నగా పిలుచుకునే రాజన్న దేవాలయంలో గత దశాబ్ద కాలంగా ఇన్చార్జి ఈవో లను, ప్రభుత్వం ఆదేశాల మేరకు ఎండోమెంట్ అధికారులు నియమిస్తూ వస్తున్నారు. తెలంగాణకే తలమానికంగా వెలుగొందుతున్న రాజన్న దేవాలయానికి పూర్తిస్థాయిలో ఈవో లేకపోవడం ఆలయ ఉద్యోగులపై పర్యవేక్షణ లేక దేవాలయంలోని ప్రధాన శాఖలో, ఉద్యోగులు అంత అవినీతి మయంతో మసక బారింది. ఇంచార్జ్ ఈవోలుగా వచ్చినవారు బాధ్యతల పట్ల సక్రమంగా ఉండటం లేదు.. ఏదో వచ్చామా.. పోయామా.. దేవాలయంలో ఏమి జరిగినా ఇన్చార్జిలుగా ఉన్న ఈవోలు పూర్తిస్థాయిలో బాధ్యతగా మెదలడం లేదని విమర్శలు ఉన్నాయి.. ఎంతో చరిత్ర ఉన్న ఈ దేవాలయానికి పూర్తిస్థాయిలో ఈవో ఉండి ఉంటే పరిపాలన దక్షత, బాధ్యతగా ఉంటారు, దేవాలయంలో అవినీతి తావు ఉండకుండా ఉద్యోగులు విధుల పట్ల బాధ్యతగా వ్యవహరిస్తారని పట్టణ ప్రజలు, భక్తులు భావిస్తున్నారు..నూతనంగా వచ్చిన ఎండోమెంట్ డిప్యూటీ కమిషనర్ హోదాలో ఉన్న కే వినోద్ రెడ్డిని దేవాలయ ఇన్చార్జ్ ఈవోగా బాధ్యతలను అప్పజెప్పారు, బాసర సరస్వతి దేవాలయంలో, సికింద్రాబాద్ లోని శ్రీ గణేష్ దేవాలయంలో పర్యవేక్షణ పై ప్రత్యేక దృష్టి సారించి సమర్థవంతంగా విధులు నిర్వర్తించిన అధికారిగా మంచి పేరుందిన అధికారిఅని దేవాలయంలో ఉద్యోగులు చర్చించుకుంటున్నారు. బాసర దేవాలయం, సికింద్రాబాద్ గణేష్ దేవాలయాలకు భిన్నంగా రాజన్న దేవాలయంలోని అధికారుల ఉద్యోగుల రాజకీయం మామూలుగా ఉండదు, వారి రాజకీయానికి నూతనంగా వచ్చిన ఈవో ఇమడకుండా, మెదలకుండా చేసి త్వరలోనే సాగనంపుతారని కిందిస్థాయి ఉద్యోగులు గుసగుసలాడుతున్నారు. వీరి రాజకీయాన్ని తట్టుకొని మేదలాలంటే పూర్తిస్థాయి ఈవో ను నియమిస్తేనే అవినీతి అధికారుల, ఉద్యోగుల ఆటలకు కళ్లెం వేయగలుగుతారు.. ఆలయ ఉద్యోగులతో ఈవో గారు జర భద్రం అని పట్టణ ప్రజలు, భక్తులు అంటున్నారు.