
నవతెలంగాణ- రామగిరి :
తెలంగాణలో రాష్ట్ర సాధారణ అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని మంథని ఎక్సైజ్ స్టేషన్ పరిధిలోని నాలుగు మండలాల్లో అక్రమంగా జరిపే గుడుంబా, మద్యం నియమ నిబంధనలలో భాగంగా ఎవరైనా నిబంధనలను అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని మంథని ఎక్సైజ్ సీఐ గురవయ్య హెచ్చరించారు. ఈ సందర్భంగా ఆయన మంథని ఎక్సైజ్ కార్యాలయంలో మాట్లాడుతూ మంథని డివిజన్ పరిధిలోని ముత్తారం, మంథని, రామగిరి, కమాన్పూర్, మండలాలలో ఎవరైనా అనాధికారికంగా బెల్లం, గుడుంబా, గంజాయి, రవాణా చేసిన బెల్ట్ షాపులు నడిపిన వారిపై చట్టపరంగా కేసులు నమోదు చేయడం జరుగుతుందన్నారు. మంథని డివిజన్ పరిధిలోని షాపులతోపాటు బార్ అండ్ రెస్టారెంట్ పై ఎన్నికల నియమ నిబంధనలలో భాగంగా చట్టపరంగా నిబంధనలను విధించడం జరిగిందన్నారు. మద్యం షాపుల నిర్వాహకులు షాపులను ఉదయం 10 నుండి రాత్రి 10 గంటల వరకు షాపులు నడుప వలనని, ఆరి1,ఆర్బి2 రిజిస్టర్లు సరుకుకు సంబంధించినవి ఎప్పటికప్పుడు వ్రాసి ఉంచవలనని ఆయన తెలిపారు. ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని ఎప్పటికప్పుడు పై అధికారుల ఆదేశాల మేరకు వారి పర్యవేక్షణలో గుడుంబా స్థావరాలు, బెల్ట్ షాపులపై విస్తృతదాడులు చేయడం జరుగుతుందన్నారు. పూర్తిగా గ్రామాల్లో గుడుంబా నిర్మూలన చేయడం జరిగిందని, ఎక్కడైనా గుడుంబా తయారి,ఆమ్మకం లేదా సరఫరా జరిగినచో తమకు సమాచారం అందించాలని ఆయన కోరారు. మంథని పోలీస్ శాఖ సహకారంతో దాడులు చేయడం జరుగుతుందన్నారు. అక్రమంగా గంజాయి సరఫరా కలిగి ఉన్న వ్యక్తులపై తగు సమాచారముతో దాడులు జరిపి కేసులు నమోదు చేయడం జరుగుతుందన్నారు. కొన్ని రాజకీయ పార్టీల వారికి మద్యం దుకాణాల యజమానులు చిట్టిల రూపంలో మద్యం బాటిళ్లు సరఫరా చేస్తున్నారనే సమాచారం తమ వద్ద ఉందన్నారు. డివిజన్ పరిధిలోని గ్రామాల్లో గుడుంబా, బెల్టు షాపుల్లో అక్రమ మద్యం దుకాణాలపై నిఘా ఉంచడం జరిగిందన్నారు. మద్యంపై నిఘా పెట్టి తనిఖీలు చేయడం జరుగుతుందని తెలిపారు. అక్రమ మద్యం దుకాణాలు, గంజాయిపై ప్రజలు సమాచారం అందించినట్లయితే వారి పేర్లను గోప్యంగా ఉంచుతామని, తమ ఫోన్ నెంబర్ లకు సీఐ 8712658820, ఎస్సై నెంబర్ 8019536636 లకు సమాచారం ఇవ్వాలని ఆయన కోరారు. 2023 జూన్ నుంచి ఈ నెల వరకు 138 కేసులు నమోదు చేశామని, అందులో 70 బైండోవర్లు, 72 మందిపై కేసులు నమోదు చేసమన్నారు. ఎక్సైజ్ శాఖ జరిపిన దాడుల్లో అక్రమంగా దొరికిన గుడుంబా, బెల్లం పానకం, బెల్లం, పట్టిక, మద్యం, బాటిల్లు, 10 ద్విచక్ర వాహనాలు, ఒక ఆటోను స్వాధీనం చేసుకొని ఒక వ్యక్తిని రిమాండ్ చేశామన్నారు. 21 సంవత్సరాలు లోపు వ్యక్తులకు మద్యం విక్రయించరాదని, దుకాణాల్లో ఎలాంటి కల్తీ జరిగిన చట్టప్రకారం కేసులు నమోదు చేసి షాపులను సీజ్ చేయడం జరుగుతుందన్నారు. ఆయన వెంట ఎస్పై సాయి, సిబ్బంది ఉన్నారు.