– ఐద్వా జాతీయ నాయకురాలు సుధా సుందరరామన్
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
దేశంలో, రాష్ట్రంలో మహిళలపై రోజురోజుకు లౌంగిక దాడులు పెరుగుతున్నాయని ఐద్వా జాతీయ నాయకులు సుధాసుందరరామన్ అన్నారు. ఐద్వా రాష్ట్ర కమిటీ సమావేశాల సందర్భంగా గురువారం హైదరాబాద్‌లోని ఆ సంఘం రాష్ట్ర కార్యాలయంలో ఎస్ పుణ్యవతితో కలిసి విలేకర్లతో మాట్లాడారు. మహిళలపై జరుగుతున్న హింసను కట్టడి చేయటంలో మోడీ ప్రభుత్వం విఫలమయిందని విమర్శించారు. మరో పక్క కార్పోరేట్ అనుకూల విధానాలతో ముందుకు పోతున్నదని చెప్పారు. ఉపాధిని నిర్వీర్యం చేసేందుకు కుట్రలు చేస్తున్నదని విమర్శించారు. అందులో భాగంగానే బడ్జెట్ కేటాయింపుల్లో కోత పెడుతున్నారని చెప్పారు. కలకత్తాలో మెడికో విద్యార్థినిపై జరిగిన దుర్మార్గాన్ని చూస్తుంటే.. దేశంలో మహిళల భద్రత ఎంత దుస్థితిలో ఉందో తెలుస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. పుణ్యవతి మాట్లడుతూ దేశ వ్యాప్తంగా మహిళల భద్రతకు వారి హక్కుల రక్షణకు, ఉపాధికి విస్తృత పోరాటాలు చేయాల్సిన అవసరముందన్నారు. మద్యం, మత్తుపదార్థాల నిర్మూలనకు దేశ వ్యాప్తంగా ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. ఐద్వా రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఆర్ అరుణజ్యోతి, మల్లులక్ష్మి, ఉపాధ్యక్షులు కెఎన్‌ఆశాలత, ఎస్. రత్నమాల, ఏఎమ్. భారతి, పి ప్రభావతి, ఎస్.వినోద. పి. కలిత ఎమ్ .లక్ష్మమ్మ, లక్ష్మి పాల్గొన్నారు.