– సీపీఎం జిల్లా కార్యదర్శి జి.జయరాజ్
నవతెలంగాణ-సంగారెడ్డి
సీపీఎం రాష్ట్ర కార్యదర్శి కామ్రేడ్ తమ్మినేని వీరభద్రం ఆరోగ్య సమాచారాన్ని హైదరాబాద్ లోని ఏఐజి హాస్పిటల్‌లో సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కామ్రేడ్ పోతినేని సుదర్శన్‌ను సీపీఎం సంగారెడ్డి జిల్లా నేతలు అడిగి తెలుసుకున్నారు. తమ్మినేని వీరభద్రం ఆరోగ్యం నిలకడగా ఉందని తెలిపారు. సీపీఎం జిల్లా కార్యదర్శి జి.జయరాజు, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు అతిమేల మాణిక్, కె.రాజయ్య ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు. తమ్మినేని వీరభద్రం ఆరోగ్యం కుదుట పదుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.