హీరో విష్ణు మంచు నటిస్తూ, నిర్మిస్తున్న ‘కన్నప్ప’లో మోహన్ బాబు, మోహన్ లాల్, శరత్ కుమార్, ప్రభాస్, బ్రహ్మానందం, మధుబాల తదితరులతోపాటు బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ ఈ సినిమాలో భాగమయ్యారు. తాజాగా ఈ సినిమా నుంచి మధుబాల లుక్‌ని రిలీజ్ చేశారు మేకర్స్. చెంచుల వీరత్వాన్ని తెలిపేలా ఉన్న ఈ లుక్ అందర్నీ ఆకట్టుకుంటోంది. ఈ మేరకు పోస్టర్ పై రాసిన పదాలు వీరనారి తెగువను తెలుపుతున్నాయి. తాజాగా రిలీజ్ చేసిన ఈ పోస్టర్ సినిమాపై ఉన్న ఆసక్తిని రెట్టింపు చేసింది. ధైర్యవంతుడైన యోధుడు, శివుని భక్తుడైన కన్నప్ప కథను అద్భుతంగా చెప్పబోతున్నారు. మోహన్ బాబు నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని ముఖేష్ కుమార్ సింగ్ డైరెక్ట్ చేస్తున్నారు. ఈ పాన్ ఇండియా ప్రాజెక్ట్ షూటింగ్ చివరి దశకు చేరుకుంది.