న్యూఢిల్లీ : ఫిన్‌టెక్ సేవల సంస్థ జాగిల్ తమ అడిషనల్ డైరెక్టర్‌గా విరాట్ దివాంజీని బోర్డులోకి తీసుకున్నట్లు ప్రకటించింది. విరాట్ బ్యాంకింగ్ రంగంలో 30 ఏళ్ల అనుభవం కలిగి ఉన్నారు, రిటైల్ బ్యాంకింగ్ సహా కొటాక్ గ్రూపులో ఏకంగా మూడు దశాబ్దాల పాటు పలు హోదాల్లో పని చేశారు. తమ వినియోగదారులకు మరిన్ని వినూత్న సేవలు అందించడానికి విరాట్ నియామకం మరింత దోహదం చేయనుందని జాగిల్ విశ్వాసం వ్యక్తం చేసింది.