– వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు
– మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్‌ను పార్టీలోకి ఆహ్వానించిన మంత్రి
– సుముఖుత వ్యక్తం చేసిన విష్ణు
నవతెలంగాణ-ముషీరాబాద్
పీజేఆర్ అంటే కాంగ్రెస్.. కాంగ్రెస్ అంటే పీజేఆర్.. అనే విధానంగా ఉండేదని, అలాంటి నాయకుని కుమారుడు, మాజీ ఎమ్మెల్యే విష్ణు అనేక ఉద్యమాల్లో తమతో కలిసి పోరాడారని వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు తెలిపారు. ఇప్పుడు బీఆర్‌ఎస్‌లో చేరేందుకు విష్ణు సుము ఖుత వ్యక్తం చేశారని చెప్పారు. మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్ రెడ్డిని దోమలగూడలోని ఆయన నివాసంలో సోమవారం మంత్రి కలిసి బీఆర్‌ఎస్ పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా విలేకరులతో మంత్రి మాట్లాడుతూ .. విష్ణువర్ధన్ ను కాంగ్రెస్ పార్టీ అవమానించిందని చెప్పారు. అయితే ఆయనకు తమ పార్టీలో సముచిత స్థానం కల్పిస్తామని హామీ ఇచ్చారు. పట్టపగలు డబ్బు కట్టలతో దొరకిన వ్యక్తి సీట్లు అమ్ముకున్న వ్యక్తి రేవంత్ రెడ్డి అని అన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రాష్ట్రం నాశనం అవుతుం దని, ఈ రాష్ట్రం ఎవరి చేతుల్లో ఉంటే బాగుంటు ందనేది జనాలు గుర్తించాలన్నారు. తెలంగాణ వాదులకు తెలంగాణ ద్రోహులకు మధ్య జరుగు తున్న పోటీ అని, ప్రజలిది గమనించాలన్నారు. విష్ణువర్ధన్ మాట్లాడుతూ.. తన నాన్న మెడలో కాంగ్రెస్ జెండా ఉంటే ఇది మా రక్తం అని అను కునే వాళ్ళమని, కానీ ఈ రోజు ఇలాంటి పరిస్థితి వస్తుందని ఊహించలేదన్నారు. పార్టీ కోసం అలుపెరుగని సేవ చేస్తూ పార్టీ పటిష్టతకు కృషి చేసిన తమకు కాంగ్రెస్ పార్టీ టిక్కెట్ ఇవ్వలేద న్నారు. కాంగ్రెస్ పార్టీలో డబ్బు రాజకీయం చలా మణి అవుతున్నదని, అందు వల్లనే బీఆర్‌ఎస్‌లో చేరాలని నిర్ణయించు కున్నట్టు తెలిపారు. గాంధీ భవన్ అమ్ముడుపో తోందని, నాయకు లు నయ వంచన కు పాల్పడుతున్నా రన్నారు. ముఖ్య మంత్రి కేసీఆర్‌తో చర్చలు జరిపానని త్వరలో బీఆర్‌ఎస్ లో చేరతానని స్పష్టం చేశారు.