మండల ప్రత్యే కాధికారిగా విష్ణువర్ధన్

నవతెలంగాణ – భీంగల్
భీంగల్ మండల ప్రత్యేక అధికారిగా విష్ణువర్ధన్ పదవి బాధ్యతలు చేపట్టారు. మండల పరిషత్  అధ్యక్షుడి పదవి ఈనెల 3 తో ముగియడంతో విష్ణువర్ధన్ మండల ప్రత్యే కాధికారిగా  విష్ణువర్ధన్ ను నియమించడంతో గురువారం బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఎంపీడీవో సంతోష్ కుమార్, ఎంపీ ఓ గంగా మోహన్, ఏపీ నరసయ్య, పంచాయతీ కార్యదర్శులు, ఐకెపి సిబ్బంది మర్యాదపూర్వకంగా కలిసి అభినందనలు తెలిపారు. మండల అభివృద్ధికి నిరంతరం పనిచేస్తానని విష్ణువర్ధన్ ఈ సందర్భంగా తెలియజేశారు.