గోపీచంద్, దర్శకుడు శ్రీను వైట్ల తొలి కాంబినేషన్‌లో వస్తున్న చిత్రం ‘విశ్వం’. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, వేణు దోనేపూడి చిత్రాలయం స్టూడియోస్‌పై ఈ చిత్రాన్ని టీజీ విశ్వప్రసాద్ నిర్మించారు. దోనేపూడి చక్రపాణి సమర్పించారు. ఈ సినిమా దసరా కానుకగా ఈనెల 11న గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ సందర్భంగా మేకర్స్ నిర్వహించిన ప్రీరిలీజ్ ఈవెంట్‌లో హీరో గోపీచంద్ మాట్లాడుతూ, ‘ఈ సినిమాకి టెక్నీషియన్స్ అందరూ చాలా కష్టపడ్డారు. చాలా రిస్కీ ప్లేసెస్‌లో షూట్ చేశాం. సినిమా ఇంత అద్భుతంగా వచ్చిందంటే వాళ్ళ హార్డ్ వర్కే కారణం. మ్యూజిక్ డైరెక్టర్ చేతన్ సౌండింగ్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, గుహన్ ఎక్స్‌ట్రార్డినరీ విజువల్ అవుట్‌పుట్స్ ఇచ్చారు. ప్రొడ్యూసర్స్ ఇద్దరికీ థ్యాంక్స్. విశ్వప్రసాద్ ఈ సినిమాకి రావడం చాలా ప్లస్ అయింది. డైరెక్టర్ శ్రీనువైట్ల సినిమాలో ఎంత ఎంటర్టైన్మెంట్ ఆశిస్తారో అంత ఎంటర్టైన్మెంట్ ఇందులో ఉంది. ఆయన మార్క్ ప్రతి ఆర్టిస్ట్‌లో కనిపిస్తుంది. థియేటర్లో కూర్చున్న ప్రతి ఒక్కరి నవ్వు ఆగదు. యాక్షన్, కామెడీ, ఫన్ ఎక్స్‌ట్రార్డినరీగా వచ్చింది. శ్రీనువైట్ల ఈజ్ బ్యాక్ విత్ బ్యాంగ్’ అని అన్నారు. ప్రొడ్యూసర్ టీజీ విశ్వప్రసాద్ మాట్లాడుతూ,’ నేను యూఎస్‌లో ఉన్నప్పుడు శీను వైట్ల సినిమాలు నాకు స్ట్రెస్ బస్టర్స్. ఆయనతో కలిసి అసోసియేట్ అవ్వడం చాలా ఆనందాన్ని ఇచ్చింది. ఈ సినిమాలో అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. గోపీచంద్‌తో ఇది మా సెకండ్ మూవీ. ఈనెల 11న అందరూ వచ్చి సినిమాని ఎంజారు చేస్తారని కోరుకుంటున్నాను’ అని తెలిపారు. ‘ఇది నాకు చాలా స్పెషల్ మూవీ. ఇదొక పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్. ప్రేక్షకులకి నవరాత్రి ట్రీట్ లాంటి సినిమా’ అని హీరోయిన్ కావ్య థాపర్ చెప్పారు.
నేను 100% నమ్మకంతో ఉన్నాను ఈ సినిమా మీ అందరిని ఎంటర్టైన్ చేస్తుంది. రెండున్నర గంటల్లో ఒక్క సెకన్ కూడా బోర్ కొట్టదు. ఎంగేజింగ్‌గా, హిలేరి యస్‌గా ఉంటుంది.
– దర్శకుడు శ్రీను వైట్ల