3న విశ్వ స్ఫూర్తి ప్రతిభా పురస్కారాలు..

నవతెలంగాణ – ఆర్మూర్ 
తెలంగాణ జాతిపిత  ప్రొఫెసర్ జయశంకర్ ఆచార్య పేరిట విశ్వబ్రాహ్మణ ఉద్యోగుల సంక్షేమ సంఘం జిల్లా ఆధ్వర్యంలో, జిల్లా కేంద్రంలోని న్యూ అంబేద్కర్ భవన్ లో ప్రతిభ పురస్కారాలు అందజేస్తున్నట్టు జిల్లా అధ్యక్షులు, గౌరవ అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శి లు రాఘవాపురం గోపాలకృష్ణచార్య, మనోహర్ ఆచార్య, పౌడపల్లి రాజారాం ఆచార్యలు శుక్రవారం తెలిపారు. ఇంటర్, పాలిటెక్ని,క్ ఐటిఐ పూర్తి చేసి పాసైన వారు, ఐఐటి నీట్ ఎంసెట్,జె.ఇ.ఇ మెయిన్ 90% పైన  నీ ట్టు, ఐఐటి  లలో సీట్ సాధించిన వారు, అత్యుత్తమ ర్యాంకులు సాధించిన వారికి  డిగ్రీ పీజీ  ప్రొఫెషనల్ కోర్సులు పూర్తిచేసిన విశ్వబ్రాహ్మణ విద్యార్థిని విద్యార్థులకు విశ్వస్పూర్తి ప్రతిభా పురస్కారాలతోనూ, నూతనంగా ప్రభుత్వ ఉద్యోగాలు సాధించిన విశ్వబ్రాహ్మణ ఉద్యోగులకు సర్వీస్ లో ప్రమోషన్లు పొందిన వారికి, సర్వీసులో ఉత్తమ పురస్కారాలు పొందిన వారికి, ఆయా శాఖల్లో సేవలందిస్తున్న ఉద్యోగ సంఘాల నాయకులకు ఈ సంవత్సరం ఉద్యోగ విరమణ పొందుతున్న విశ్వబ్రాహ్మణ ఉద్యోగస్తులందరికీ.,ఆయా రంగాల్లో అత్యుత్తమ ప్రతిభను ప్రదర్శిస్తున్న విశ్వబ్రాహ్మణ కళాకారులకు రచయితలకు పాత్రికేయ మిత్రులకు రాజకీయ నాయకులకు విశ్వకీర్తి ప్రతిభా పురస్కారాలు ప్రదానం, సత్కార కార్యక్రమం ఉంటుంది.ప్రొఫెసర్ జయశంకర్ ఆచార్య జిల్లాస్థాయి ప్రతిభా పురస్కారాలకు అర్హులని అన్నారు.  ఆర్మూర్ డివిజన్ పరిధిలోగల అన్ని మండలాల చెందినవారు 9391044536, 9704496588, నంబర్లకు నిజాంబాద్ డివిజన్ పరిధిలోని అన్ని మండలాలకు చెందినవారు 9492481288, 9550469917,నంబర్లకు బోధన్ డివిజన్ పరిధిలోని అన్ని మండలాలకు చెందినవారు 9963290646, 94 94961238 నంబర్లకు బయోడేటాతో పాటు,ఆధార్ కార్డు ఫోటో సంబంధిత  ధ్రువపత్రాలు వాట్సప్ ద్వారా  పంపాలని కోరినారు.