‘రాంకీ’కి విశ్వకర్మ అవార్డులు

'రాంకీ'కి విశ్వకర్మ అవార్డులునవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
రాంకీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ లిమిటెడ్‌కు నాలుగు విభాగాల్లో ‘విశ్వకర్మ’ అవార్డులు లభించాయి. నిర్మాణ రంగంలో పర్యావరణ హితమైన అత్యున్నత సాంకేతికత, నిర్వహణ వంటి పలు అంశాల్లో అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన సంస్థలకు ఏటా నిటి అయోగ్‌, భారత నిర్మాణ సంస్థ (సీఐడీసీ) సంయుక్తంగా ‘విశ్వకర్మ’ అవార్డులను ప్రదానం చేస్తాయి. 2024 సంవత్సరానికి గానూ ఢిల్లీలో జరిగిన సీఐడీసీ 15వ వార్షికోత్సవ కార్యక్రమంలో రాంకీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ యంచర్ల రత్నాకర నాగరాజు ఈ అవార్డుల్ని అందుకున్నారు. ఉత్తమ నిర్మాణ ప్రాజెక్ట్‌, సాంఘికాభివద్ధి, ఉత్తమ వత్తి నిర్వహణ, నిర్మాణం, ఆరోగ్యం, భద్రత, పర్యావరణం అంశాల్లో అవార్డులు లభించాయి. ఈ సందర్భంగా రాంకీ ఎమ్‌డీ మాట్లాడుతూ స్థిరమైన సమ్మిళిత అభివృద్ధి సాధనలో కంపెనీ చూపిన నిబద్ధతకు లభించినట్లయ్యిందన్నారు. అవార్డుల స్వీకరణ తర్వాత నిర్మాణరంగంలో తమ సంస్థ బాధ్యత మరింత పెరిగిందనీ, ఏ ప్రాజెక్ట్‌ రూపకల్పనలో అయినా తాము మొదటి ప్రాధాన్యత పర్యావరణానికే ఇస్తామని చెప్పారు. అవార్డులు రావడానికి కృషి చేసిన కంపెనీ ఉద్యోగులందరికీ కృతజ్ఞతలు తెలిపారు.