గాంధారి మండల కేంద్రంలో ఆదివారం విశ్వకర్మజయంతి సందర్భంగా విశ్వకర్మ సమైఖ్య సంఘం ఆధ్వర్యంలో కాళిక మాత ఆలయం వద్దకు విశ్వకర్మ చిత్రపటానికి సంఘం సభ్యులు పూలమాలలు వేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో సమాఖ్య సంఘం అధ్యక్షుడు వడ్ల సిద్ది రాములు, ప్రధానకార్యదర్శి అవుసుల భైరవప్రసాద్,సంఘం సభ్యులు పాల్గొన్నారు. అలాగే మండలంలోని జువ్వాడి, పోతాంగల్, సంగెం, తదితర గ్రామంలో విశ్వకర్మ జయంతిని విశ్వకర్మ సంఘల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.